Sunday, February 23, 2025

మోడీ రెండో ప్రధాన కార్యదర్శిగా శక్తికాంత దాస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆర్‌బిఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్‌కు మరో గౌరవప్రదమైన పదవి దక్కింది. ఆయన్ను ప్రధాని మోడీ రెండో ప్రధాన కార్యదర్శిగా శనివారం క్యాబినేట్ కమిటీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ‘రిటైర్డ్ ఐఎఎస్ శక్తికాంత దాస్‌ను ప్రధాన మంత్రి రెండో ప్రధాన కార్యదర్శిగా నియమించేందుకు క్యాబినేట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఆయన పదవి నియామకం ప్రధానమంత్రి పదవీకాలం లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగుతుంది’ అని ఉత్తర్వుల్లో పేర్కొంది.

దీంతో ఆయన ప్రమోద్ మిశ్రాతో కలిసి ఈ బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ప్రమోద్ మిశ్రా సెప్టెంబర్ 11 2019గా ప్రధానమంత్రి కార్యదర్శిగా బాధ్యతలు చెప్పట్టారు. ఆ తర్వాత ఆయన జూన్ 2024న మళ్లీ ఆ పదవిలో నియమితులయ్యారు.

శక్తికాంత దాస్, ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ విభాగంలో, ఆర్థిక వ్యవహారాల విభాగంలో కార్యదర్శిగా పని చేశారు. ఆ తర్వాత ఆయన 2018 డిసెంబర్ 12వ తేదీన ఆర్‌బిఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. 38 సంవత్సరాల సర్వీస్‌లో ఆయన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో ఆయన పలు కీలక పదవుల్లో ఉన్నారు. ప్రతిష్టాత్మక ఐఎంఎఫ్, జి-20. బ్రిక్స్, సార్క్ తదితర సమావేశాల్లో ఆయన భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News