Wednesday, November 6, 2024

ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్‌కు అవార్డు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆర్‌బిఐ (భారతీయ రిజర్వ్ బ్యాంక్) గవర్నర్ శక్తికాంత దాస్ టాప్ సెంట్రల్ బ్యాంకర్‌గా గ్లోబల్ అవార్డును అందుకున్నారు. మొరాకోలోని మరక్కేష్ పట్టణంలో ఆయన ఈ అవార్డును అందుకోగా, ఈ ఫోటోను ఆర్‌బిఐ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసింది. శక్తికాంత దాస్ గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్స్ రిపోర్ట్ కార్డ్ 2023లో ‘ఎ+’ రేటింగ్‌ను అందుకున్నారు. అంతకుముందు జూన్‌లో లండన్‌లో జరిగిన సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్ 2023లో అమెరికా గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ‘గవర్నర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో శక్తికాంత దాస్‌ను సత్కరించారు.

అయితే వాస్తవికత, సృజనాత్మకత, కష్టపడి పనిచేసే వారి కంటే తమ పోటీదారుల కంటే మెరుగ్గా పనిచేసిన గవర్నర్‌లకు వార్షిక సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్‌లో టాప్ ర్యాంక్ ఇస్తారు. దాస్‌తో పాటు స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ జె. జోర్డాన్, వియత్నాం గవర్నర్ నుయెన్ తి హోయాంగ్‌లకు కూడా ఎ+ గ్రేడ్‌లు లభించాయి. ఈ పోటీలో 101 దేశాలు, ప్రాంతాలు, జిల్లాల సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు గ్రేడ్ పొందారు. వీటిలో బ్యాంక్ ఆఫ్ యూరోపియన్ యూనియన్, ఈస్ట్ కరీబియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ సెంట్రల్ ఆఫ్రికన్ స్టేట్స్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ ఉన్నాయి.

మోడీ అభినందనలు
గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్ 2023లో ‘ఎ+’ రేటింగ్ పొందినందుకు శక్తికాంత దాస్‌ను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. ప్రపంచంలో మన ఆర్థిక నాయకత్వాన్ని ప్రతిబింబిస్తూ భారతదేశానికి ఇది గర్వకారణం అని అన్నారు. శక్తికాంత దాస్ అంకితభావం, దూరదృష్టి దేశ అభివృద్ధి ప్రయాణాన్ని బలోపేతం చేయడానికి కొనసాగుతుందని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ప్రధాని పోస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News