Monday, December 23, 2024

‘శాకుంతలం’ త్రీడీ ట్రైలర్‌ విడుదల..

- Advertisement -
- Advertisement -

ప్యాషనేట్ ఎపిక్ ఫిల్మ్‌మేకర్ గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న పౌరాణిక ప్రేమకథా చిత్రం ‘శాకుంతలం’. ఈ ఎపిక్ లవ్ స్టోరీలో సమంత, దేవ్ మోహన్ జంటగా నటించారు. ఈ విజువల్ వండర్ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుంది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ‘శాకుంతలం’ను రూపొందిస్తున్నారు గుణ శేఖర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 3డి టెక్నాలజీతో విజువల్ వండర్‌గా తెలుగు, హిందీ, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది. మంగళవారం ఈ సినిమా త్రీడీ ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ “శాకుంతలం సినిమాను 3డి టెక్నాలజీలోకి మార్చాలనే ఆలోచన దిల్‌రాజుదే.

Shakuntala Movie 3D Trailer Launched

ఇప్పుడు త్రీడీ ట్రైలర్ చూస్తుంటే ఆయన ఆలోచన ఎంత గొప్పదో అర్థమవుతుంది. 3డిలో శాకుంతలం సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను”అని అన్నారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ “బ్యూటీఫుల్ ఫ్యామిలీ డ్రామా ‘శాకుంతలం’. విజువల్ వండర్‌గా సినిమా తెరకెక్కింది. ఏప్రిల్ 14న ఫ్యామిలీస్ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది ఈ సినిమా. ఈ మూవీ వ్యవధి 2 గంటల 19 నిమిషాలు. ఈ టైమ్‌లో సినిమా ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టదు”అని తెలిపారు. దర్శకుడు గుణ శేఖర్ మాట్లాడుతూ “ఇది సమంత ‘శాకుంతలం’. ఆమె ప్రాణం పెట్టి శకుంతల పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేశారు. ఈ సినిమాలో దిల్‌రాజు ఓ భాగమవుతారని అనగానే నేను ఆసక్తి చూపించాను. ఆయనను వాడుకోవాల్సిన అవసరం మాకు ఉంది”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎడిటర్ ప్రవీణ్ పూడి, రైటర్ సాయిమాధవ్ బుర్రా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News