Sunday, December 22, 2024

శకుంతల పాత్ర నేటి అమ్మాయిలకు కనెక్ట్ అవుతుంది

- Advertisement -
- Advertisement -

ప్యాషనేట్ ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన పౌరాణిక ప్రేమకథా చిత్రం ‘శాకుంతలం’. ఈ ఎపిక్ లవ్ స్టోరీలో సమంత, దేవ్ మోహన్ జంటగా నటించారు. ఈ విజువల్ వండర్ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుంది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా శాకుంతలం సినిమాను రూపొందించారు గుణ శేఖర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజుసమర్పణలో గుణటీమ్ వర్క్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించారు. 3డి టెక్నాలజీతో తెలుగు, హిందీ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది. హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో హీరోయిన్ సమంత మాట్లాడుతూ “5వ శతాబ్దంలో రాసిన కథ శాకుంతలం. శకుంతల పాత్ర నేటి అమ్మాయిలకు కనెక్ట్ అవుతుంది.ఈ శకుంతల రోల్ చేయ డం అనేది నటిగా నాకు ఓ పెద్ద బాధ్యత.

నేను ఈ పాత్రకు న్యాయం చేశాననే అనుకుంటున్నా ను. అందుకు కారణం దర్శకుడు, నిర్మాత నా నటనపై సంతృప్తిగా ఉన్నారు. ఇక శకుంతల దుష్యంతుడితో ప్రేమలో పడుతుంది. అప్పటి సమాజానికి విరుద్ధంగా ఆమె వెళ్తుంది. ఓటమిని అస్సలు ఒప్పుకోదు. ఇవన్నీ చూస్తుంటే ఇప్పటి మహిళల్లో చాలా మందికి ఆమె పాత్ర కనెక్ట్ అవుతుందని చెప్పాలి. నేను కొచ్చిలో ‘శాకుంతలం’ త్రీడీ ట్రైలర్ చూసి షాకయ్యాను. మ్యాజికల్ ప్రపంచాన్ని దర్శకుడు గుణశేఖర్ ‘శాకుంతలం’ కోసం సృష్టించారు”అని అన్నా రు. దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ “ఈ సినిమాలో ఒరిజినల్ నగలను మేము ఉపయోగించాము. అయితే ఈ సినిమాలో సమంత రాణిగా కనిపించేది తక్కువ సేపే. అయితే మేము ఆభరణాలను ఎలా ఉపయోగించామనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఇక దుష్యంతుడు, శకుంతల కలిసిన తర్వాత భరతుడి పట్టాభిషేకంతో ‘శాకుంతలం’ సినిమాను ముగించాం”అని పేర్కొన్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ “నేను నిర్మాతగా 50 సినిమాలు చేశాను. ప్రొడ్యూసర్‌గా 70 శాతం సక్సెస్ రేట్ ఉంది. ఇన్ని సినిమాలు చేసిన నేను ఇలాంటి డిఫెరెంట్ సినిమా కూడా చేయాలనే ఉద్దేశంతో ఇందులో పార్ట్ అయ్యాను”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News