Monday, December 23, 2024

ఐఎఎఫ్ చరిత్రలో తొలి మహిళా ఫ్లైట్ కమాండర్‌గా షాలిజా ధామి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత వైమానిక దళం ఫ్లైట్ కమాండర్‌గా షాలిజా ధామి ఎంపికయ్యారు. దేశంలో ఫ్లయింగ్ యూనిట్‌కు ఫ్లైట్ కమాండర్ అయిన మొదటి మహిళా అధికారిణిగా ధామి చరిత్ర సృష్టించారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చరిత్రలో ఓ మహిళా అధికారిణి ఫ్లైట్ కమాండర్‌గా వ్యవహరించడం ఇదే ప్రథమం. హిండన్ ఎయిర్‌బేస్‌లోని చేతక్ హెలికాప్టర్ యూనిట్‌కు ఫ్లైట్ కమాండర్‌గా ధామి ఇటీవల బాధ్యతలు స్వీకరించారు.

వైమానిక దళంలోని ఫ్లయింగ్ బ్రాంచ్‌లో శాశ్వత కమిషన్ అధికారిణిగా ఫ్లైట్ కమాండర్ హోదాను యూనిట్ రెండో అత్యున్నత స్థాయిగా పరిగణిస్తారు. కమాండింగ్ అధికారి తరువాత రెండోస్థానంలో ఫ్లైట్ కమాండర్ ఉంటారు. ఈ నెల ఆరంభంలో ఆర్మీ ఆఫీసర్లకు కమాండర్‌లుగా తొలిసారి నియామకాన్ని ప్రారంభించింది. కాగా గ్రూప్ కెప్టెన్ షాలిజా ధామి పైలట్‌గా గంటల ఫ్లయింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను సొంతం చేసుకున్నారు. ఐఎఎఫ్‌లో గ్రూప్ కెప్టెన్ హోదా కల్నల్ హోదాకు సమానంగా పరిగణిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News