Thursday, January 23, 2025

విడాకులను సెలబ్రేట్ చేసుకున్న ‘షాలిని’

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారతీయ సమాజంలో విడాకులను ఓ కళంకంగా భావిస్తారు. ప్రధానంగా విడాకులకు సంబంధించి మహిళలను బాధితులుగా పేర్కొంటారు. అయితే ఈ వాదనకు భిన్నంగా ఆర్టిస్టు, ఫ్యాషన్ డిజైనర్ షాలిని కొత్త సంప్రదాయానికి తెర లేపారు. విడాకులను ఫొటోషూట్‌తో సెలబ్రేట్ చేసుకున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫొటోలను షాలిని పోస్టు చేయగా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ‘బ్యాడ్ మ్యారేజి’ ముగిసినందుకు పండుగ చేసుకుంటున్నట్లు షాలిని పేర్కొన్నారు.

మీ జీవితాన్ని మీ అధీనంలోకి తీసుకుని మెరుగైన భవిష్యత్తు కోసం అవసరమైన మార్పులు చేసుకోవాలని విడాకులు తీసుకున్నవారికి షాలిని సూచించారు. విడాకులు తీసుకున్న మహిళ ఇచ్చే సందేశానికి విలువ ఉండదని చెప్పేవారిని తను పట్టించుకోను అన్నారు. విడాకుల అనేది ఫెయిల్యూర్ కాదని జీవితంలో టర్నింగ్ పాయింట్‌గా షాలిని పేర్కొన్నారు. వివాహ బంధాన్ని కాదని ఒంటరిగా జీవించాలంటే చాలా ధైర్యం ఉండాలన్నారు. ‘డైవోర్స్ నాట్ ఫెయిల్యూర్’ క్యాప్షన్ ధైర్యవంతమైన మహిళలకు అంకితమిస్తున్నట్లు షాలిని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News