Friday, January 24, 2025

ప్రశ్నపత్రాల లీక్ ముద్దాయిలను బిజెపి సన్మానించడం సిగ్గుచేటు: ఎఐవైఎఫ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టెన్త్ వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ముద్దాయిలను బీజేపీ శ్రేణులు సన్మానించడం సిగ్గుచేటాని అఖిల భారత యువజన సమాఖ్య(ఏ ఐ వై ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి కె. ధర్మేంద్రలు అన్నారు. బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. లీకేజీ సూత్రధారులకు బీజేపీ అండగా ఉంటుందనే ప్రత్యక్ష సంకేతానికి ఇది నిదర్శనమని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అదే విధంగా పదవ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ ప్రధాన ముద్దాయి పోలీసు ఉన్నతాధికారులపై అసత్య ఆరోపణలు చేస్తూ, కేసు నుండి తప్పించుకోవాలనే కుయుక్తులు చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు.స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టివేసే బీజేపీ కుటిల నీచ రాజకీయాలను విద్యార్థులు, యువత దృష్టికి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేస్తామని వారు స్పష్టంచేశారు. పోలీసు యంత్రాంగం టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ కేసును నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. అవసరమైతే ఉన్నత హైకోర్టు న్యాయమూర్తితో సత్వర విచారణ చేపట్టి దోషులను జైలుకు పంపాలని వారు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News