Sunday, December 22, 2024

ఎంపిలో దళిత జంటకు అవమానం

- Advertisement -
- Advertisement -

కొట్టి, మెడలో చెప్పుల దండ వేశారు
10 మందిపై కేసు నమోదు

అశోక్ నగర్ (ఎంపి) : మధ్య ప్రదేశ్ అశోక్ నగర్ జిల్లాలో వృద్ధ దళిత దంపతులను కొట్టి, చెప్పుల దండ ధరించేలా చేశారని పోలీసులు ఆదివారం వెల్లడించారు. ఆ దంపతుల కుమారుడు ఒక మహిళను వేధించినట్లు ఆరోపణ ఉందని పోలీసులు తెలిపారు. ముంగవోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కిలోరా గ్రామంలో శుక్రవారం ఆ దంపతులపై దౌర్జన్య సంఘటన సందర్భంగా పరారీలో ఉన్న పది మంది వ్యక్తులపై ఒక కేసు నమోదు చేసినట్లు అధికారి ఒకరు తెలిపారు. ఆ దంపతుల కుమారుడు నిందితుల్లో ఒకరి భార్యను వేధించినట్లు తెలుస్తోందని, ఆ తరువాత దళిత కుటుంబం గ్రామం వదలి వెళ్లిందని ముంగవోలి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి గబ్బర్ సింగ్ గుర్జర్ చెప్పారు.

ఆ దంపతులు ఇటీవలే గ్రామానికి వచ్చారని ఆయన తెలిపారు. శుక్రవారం నిందితులు 65 ఏళ్ల దళితుని, అతని 60 ఏళ్ల భార్యను ఒక స్తంభానికి కట్టివేసి, కొట్టారని, వారిని చెప్పుల దండ ధరించేలా చేశారని అధికారి వివరించారు. బాధిత మహిళ ఫిర్యాదుపై పోలీసులు శనివారం ఐపిసిలోని వివిధ సెక్షన్ల కింద పది మంది వ్యక్తులపై కేసు నమోదు చేశారని ఆయన తెలియజేశారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి ఆచూకీ తీయడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News