నల్లగొండ: నకిరేకల్ దళిత ఎమ్మెల్యే వేముల వీరేశంకు అవమానం జరిగింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటనలో ఎమ్మెల్యే వీరేశాన్ని పోలీసులు గుర్తుపట్టలేదు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వాగతం పలికేందుకు పోలీసులు వీరేశాన్ని లోపలికి అనుమతి ఇవ్వలేదు. దీంతో వేముల వీరేశం అలిగి వెళ్లిపోయారు. అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోతుండగా అక్కడే ఉన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి బుజ్జగించి వెనక్కి రమ్మని అడిగారు. కానీ తీవ్ర అసహనంతో అక్కడ నుంచి వీరేశం వెళ్లిపోయారు. పోలీసులకు కామన్ సెన్స్ ఉండదా అంటూ ఎంఎల్ఎ ఎవరు కాదా? అనేది తెల్వదా అంటూ మండిపడ్డారు.
మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హెలికాప్టర్‌లో భువనగిరికి చేరుకున్నారు. వారికి స్వాగతం పలికేందుకు ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు హెలిపాడ్ వద్దకు వేర్వేరుగా వెళ్తుండగా, మెటల్ డిటెక్టర్ పాయింట్ వద్ద గుర్తించని పోలీసు అధికారులు వారిని అడ్డుకున్నారు. మంత్రులు భువనగిరి పర్యటనలో భాగంగా వారికి స్వాగతం పలికేందుకు వచ్చిన ఎంపి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని పోలీసులు వేర్వేరుగా అడ్డుకున్నట్టు సమాచారం.