Wednesday, January 8, 2025

అభిమానులకు షమీ క్షమాపణలు

- Advertisement -
- Advertisement -

ముంబై: టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ అభిమానులు, భారత క్రికెట్ బోర్డు(బిసిసిఐ)కి క్షమాపణలు చెప్పా డు. ఇటీవలె షమి సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ వీడియోను పోస్ట్ చేశాడు. అతిత్వరలో తిరిగి రెడ్ బాల్ క్రికెట్‌కు తిరిగొస్తానని భరోసా ఇస్తూ పేర్కొన్నాడు. దీంతో ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో షమీ తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేస్తాడని భావించారంతా.

కానీ సిరీస్ ప్రారంభ సమయానికి షమి పూర్తిగా కోలుకోవడంపై సందేహంగా ఉండటంతో షమీ లేకుండా 18 మందితో కూడిన భారత జట్టును బిసిసిఐ ప్రకటించింది. అయితే రీఎంట్రీపై అంచనాలను అందుకోకపోవడంతో బిసిసిఐకి, అభిమానులకు షమీ సారీ చెప్పాడు. ‘తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను. బౌలింగ్ ఫిట్‌నెస్‌లో రోజురోజుకు మెరుగుపడుతున్నాను. మ్యాచ్‌కు, దేశవాళీ క్రికెట్‌కు సిద్ధంగా ఉండటానికి కఠోరంగా శ్రమిస్తున్నాను. కానీ అంచనాలకు అందుకోలేకపోయాను. క్రికెట్ అభిమానులు, బిసిసిఐకి క్షమాపణలు. అయితే అతిత్వరలో రెడ్ బాల్ క్రికెట్‌కు తిరిగొస్తాను” అని షమీ పేర్కొన్నాడు. 2023 వన్డే వరల్ కప్ అనంతరం చీలమండల గాయంతో షమి జట్టుకు దూరమయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News