Sunday, December 22, 2024

అలాంటి ఆలోచన రాకుండా చేశా: షమీ

- Advertisement -
- Advertisement -

ముంబై: భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో తనకు తుది జట్టులో స్థానం లభించక పోవడంతో ఎంతో బాధకు గురయ్యానని, ఒకసారి ఛాన్స్ లభి స్తే తానెంటో నిరూపించాలనే కసిలో తనలో పెరిగి పోయింద ని, అనూహ్యంగా జట్టులో ఛా న్స్ దక్కడంతో మళ్లీ వెనుదిరిగి చూడలేదని భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ పేర్కొన్నాడు. కసితో రగిలిపోయిన తాను మళ్లీ తుది జట్టు నుంచి తప్పించాలనే ఆలోచన రాకుండా చేశానని పేర్కొన్నాడు.

వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నమెంట్‌లలో తనపై చిన్నచూపు చూడడం కొందరికీ అలవాటుగా మారిందని, ఇది తనను ఎం తో మనో వేదనకు గురిచేసేదన్నాడు. వన్డే ప్రపంచకప్‌లో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైందన్నాడు. తనకు తు ది జట్టులో స్థానం దక్కలేదన్నాడు. దీంతో అవకాశం లభిస్తే తానెంటో చూపించాలనే కసితో రగిలిపోయానన్నాడు. ఛాన్స్ దక్కడంతో అవకాశా న్ని తనకు అనుకూలంగా మార్చుకున్నానని పేర్కొన్నాడు. అద్భుత ప్రదర్శనతో తనను దూరంగా పెట్టిన వారికి గట్టి సమాధానం ఇచ్చానని వివరించాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న షమీ ఈ వివరాలు వెల్లడించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News