Sunday, December 22, 2024

వారు అలా చేస్తారనుకోలేదు: మహ్మద్ షమి

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రపంచకప్ ముగిసిన వెంట నే అంతర్జాతీయ టి20 ఫార్మాట్‌కు రి టైర్మెంట్ ప్రకటిస్తూ భారత సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లు తీసుకున్న నిర్ణయం తనను షాక్‌కు గురి చేసిందని స్టార్ ఫాస్ట్ బౌలర్ మ హ్మద్ షమి పేర్కొన్నాడు. మరికొంత కాలం టి20 ఫార్మాట్‌లో కొనసాగే సత్తా ఇద్దరికీ ఉందన్నాడు. ఇలాంటి స్థితిలో విరాట్, రోహిత్‌లు అంతర్జాతీయ టి20కి గుడ్‌బై చెప్పడాన్ని తాను జీర్ణించుకోలేక పోతున్నట్టు తెలిపాడు. వీరి లోటును పూడ్చడం అనుకున్నంత తేలికేం కాదన్నాడు.

భారత క్రికెట్‌కు లభించిన అత్యుత్తమ క్రికెటర్లలో రోహిత్, కోహ్లిలది ప్రత్యేక స్థానమన్నాడు. వీరికి సాటి వచ్చే క్రికెటర్లు సమీప భవిష్యత్తులో కనిపించడం లేదన్నాడు. వీరు వచ్చే వరల్డ్‌కప్ వరకు అంతర్జాతీయ టి20లో కొనసాగి ఉంటే బాగుండేదని షమి అభిప్రాయపడ్డాడు. వీరు తీసుకున్న నిర్ణయం నుంచి తాను ఇప్పటికీ తేరుకోలేక పోతున్నాడు. వాపోయాడు. కాగా, వరల్డ్‌కప్‌లో టీమిండియా ట్రోఫీని సాధించడం తనను ఎంతో ఆనందానికి గురిచేసిందని షమి పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News