Wednesday, January 22, 2025

బిజెపిలోకి షమి?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టీమిండియా స్టార్ పేస్ బౌలర్ మహమ్మద్ షమి రాజకీయలోకి వస్తున్నట్టు వార్తలు జాతీయ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో షమి పశ్చిమ బెంగాల్ నుంచి పోటీ చేస్తున్నట్టు రాజకీయ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే బిజెపి అధిష్ఠానం షమిని కలవడంతో చర్చలు సానుకూలంగా జరిగాయని సమాచారం. షమి మాత్రం ఇప్పటివరకు ఏ నిర్ణయం వెల్లడించలేదని బిజెపి వర్గాలు పేర్కొన్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని బసిర్‌హత్ నియోజకవర్గం నుంచి అతడిని పోటీ చేయించాలని బిజెపి భావిస్తోంది. బసిర్‌హత్ నియోజకవర్గం నుంచి టిఎంసి నేత నుస్రత్ జహాన్ ఎంపిగా సేవలందిస్తున్నారు. ఈ నియోజకవర్గంలోని సందేశ్ ఖాలీ ప్రాంతం అనేది దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. షమి కుడికాలి చీలమండకు గాయకావడంతో ప్రస్తుతం ఆయన లండన్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. ఐపిఎల్ 2024 సీజన్‌కు కూడా అందుబాటులో ఉండడంలేదు. చీలమండకు శస్త్రచికిత్స గురించి ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. భారత జట్టు వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో ఓడిపోయిన తరువాత టీమిండియా ఆటగాళ్లను ప్రధాని మోడీ ఓదార్చిన విషయం తెలిసిందే. అద్భుతంగా బౌలింగ్ చేసిన షమిని తన దగ్గరకు తీసుకొని ఓదార్చడంతో పాటు అతడిని మోడీ అభినందించిన విషయం విధితమే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News