Monday, December 23, 2024

లైన్ లెంగ్త్‌లో పట్టు సాధిస్తే ఉమ్రాన్ ప్రపంచాన్ని ఏలుతాడు: షమి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉమ్రాన్ మాలిక్ అద్భుతమైన వేగంతో బౌలింగ్ చేస్తున్నాడని సీనియర్ ఫాస్ట్‌బౌలర్ మహమ్మద్ షమి కితాబిచ్చాడు. ఉమ్రాన్ లైన్ లెంగ్త్‌ను ఒడిసి పట్టుకోగలిగితే ప్రపంచాన్ని ఏలుతావన్నాడు. ఉమ్రాన్ బౌలింగ్‌లో నియంత్రణ, కచ్చితత్వం ఉండడం లేదన్నాడు. మాలిక్ పేస్ ఎదుర్కొవడం అంత సులభం కాదని, లైన్ లెంగ్త్‌పై దృష్టి సాధిస్తే సరిపోతుందని సలహా ఇచ్చారు. బిసిసిఐ టివి పోస్టులో షిమిని ఉమ్రాన్ చలాకిగా ప్రశ్నించాడు. ప్రతి మ్యాచ్‌లో ప్రశాంతంగా ఆనందంగా ఎలా ఉంటున్నావని అడగడంతో… అంతర్జాతీయ మ్యాచ్‌లో ఒత్తిడికి గురైతే ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. ప్రశాంతంగా ఉన్నప్పుడే మనలోని టాలెంట్ బయటకు వస్తుందన్నాడు. మైదానంలో సరైన ప్రణాళికలు అమలు చేయాలని సూచించాడు. ప్రతి మ్యాచ్‌లోను పిచ్‌పై కన్నేసి పరిస్థితులకు తగినట్లుగా బౌలింగ్ చేయాలని షమి తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News