Thursday, January 23, 2025

షమీ బౌలింగ్ అదుర్స్… ఈ ఏడు వికెట్లు చూడాల్సిందే (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రపంచ కప్‌లో షమీ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో షమీ ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి భారత జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర వహించాడు. హార్ధిక్ పాండ్యా గాయపడడంతో షమీ జట్టులోకి వచ్చాడు. ఆడింది ఆరు మ్యాచ్‌లే కానీ ఇప్పటికే 23 వికెట్లు తీసి తొలి స్థానంలో ఉన్నాడు. మూడు సార్లు ఐదు వికెట్లు తీసి టీమిండియా గెలుపులో ప్రముఖ పాత్ర వహించాడు. షమీ బౌలింగ్ బంతులకు బ్యాట్స్‌మెన్లు తికమక పడుతున్నారు. ఎప్పుడు ఎలా వికెట్ తీశాడో ఎవరికి అర్థం కావడంలేదు. ఈ ప్రపంచ కప్‌లో బెస్ట్ బౌలింగ్‌లో టాప్-5 మూడు సార్లు షమీ ఉండడం గ్రేట్. బౌలింగ్ యావరేజ్‌లో షమీ ప్రథమ స్థానంలో ఉన్నాడు. 2019 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా బౌలర్ స్టార్క్ 27 వికెట్లు తీసి తొలి స్థానంలో ఉండగా మెక్ గ్రాత్ 26 వికెట్లతో రెండో స్థానం, షమీ 23 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News