Sunday, January 19, 2025

షమీ భార్య ఆసక్తికర వ్యాఖ్యలు… మంచి ఆటగాడే కానీ…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈ వరల్డ్ కప్‌లో మహ్మద్ షమీ అద్భుతంగా బౌలంగ్ చేస్తున్నాడు. సెమీఫైనల్ మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసి న్యూజిలాండ్ జట్టు వెన్నువిరిచాడు. షమీ ఆడింది ఆరు మ్యాచ్‌లే కానీ 23 వికెట్లు పడగొట్టి తొలి స్థానంలో ఉన్నాడు. తాజాగా షమీ మాజీ భార్య హసీన్ జహాన్ అతడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. షమీ మంచి ఆటగాడు అని, మంచి భర్తగా ఉంటే బాగుండని హసీన్ కామెంట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఓ టివి చానెల్ చర్చలో హసీన్ మాట్లాడుతుండగా షమీ ప్రదర్శనపై ప్రశ్నలు అడగడంతో ఆమె స్పందించారు. షమీ మంచి ఆటగాడు అని, మంచి భర్త, తండ్రిగా ఉండి ఉంటే ఇంకా బాగుండునని, తామంతా కలిసి ఉండేవాళ్లమన్నారు.

షమీకి ఇప్పుడు లభించే గౌరవం కంటే మరింత పెరిగేదన్నారు. అతడి దురాశ, చెడు ఆలోచనలు, తప్పుల కారణంగా తాము ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని, షమీ ప్రతిదీ డబ్బుతో దాచాలని చూస్తున్నాడని ఆమె తీవ్రంగా విమర్శలు చేసింది. క్రికెట్ అంటే తనకు తెలియదని, క్రికెటర్లకు అభిమానిగా లేనని స్పష్టం చేశారు. అతడు మంచిగా ఆడితో టీమిండియాలో చోటు ఉంటుందని, బాగా డబ్బులు సంపాదిస్తాడని కామెంట్లు చేసింది. వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. 2014లో హసీన్ జహాన్‌ను షమీ పెళ్లి చేసుకున్నాడు. 2015లో ఈ దంపతులకు కుమార్తె జన్మించింది. ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో షమీపై హసీన్ వేధింపుల కేసు నమోదు చేసింది. గృహహింస కేసు కింద షమీకి కోల్‌కతా కోర్టు నెలకు రూ. 1.3 లక్షల భరణం చెల్లించాలని ఆదేశించింది. దీంతో 2018 నుంచి ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News