Wednesday, April 30, 2025

ఎసిబి వలలో శామీర్‌పేట ఎస్‌ఐ

- Advertisement -
- Advertisement -

లంచం తీసుకుంటున్న పోలీస్ అధికారిని ఎసిబి అధికారులు పోలీస్ స్టేషన్లోనే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, శామీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఎసిబి డిఎస్‌పి శ్రీధర్ వివరాలను వెల్లడించారు. ఈ నెల 20న నూనె విక్రయంపై నమోదైన చీటింగ్ కేసు నుంచి స్టేషన్ బెయిల్ ఇచ్చి తప్పించేందుకు శామీర్ పేట ఎస్‌ఐ పరశురాం నాయక్‌ను బాధితులు సంప్రదించారు. తనకు రూ.2 లక్షలు లంచం ఇవ్వాలని బాధితులను ఎస్‌ఐ డిమాండ్ చేశాడు. ఈ నెల 21న రూ. 2 లక్షలను బాధితులు తీసుకువచ్చి ఎస్‌ఐని కలవగా కారులో పెట్టాలని సూచించాడు. మరుచటిరోజు అందులో డబ్బులు తక్కువగా ఉన్నాయని, అదనంగా మరో రూ.25 వేలు కావాలని డిమాండ్ చేశాడు.

దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి అధికారుల సూచనల మేరకు బాధితుడు రూ.22 వేలను ఎస్‌ఐతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. సోమవారం శామీర్‌పేట పోలీస్ స్టేషన్‌కు బాధితుడు వచ్చి ఎస్‌ఐని కలిసాడు. తన ఛాంబర్‌లో ఉన్న చెత్తబుట్టలో డబ్బులను వేయాలని ఎస్‌ఐ సూచించాడు. వెంటనే ఎసిబి సిటీ రేంజ్ యూనిట్ 2 అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్‌ఐని ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. కాగా, ఈ కేసులో ఎంతమందికి ప్రమేయం ఉందన్న కోణంలో విచారిస్తున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News