Monday, December 23, 2024

ఎయిర్ పోర్టుకు ప్రతి 15 నిమిషాలకో బస్సు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు 15 నిమిషాలకు బస్సు నడపనున్నారు. దీనిపై ఆర్‌టిసి ప్రత్యేక దృష్టి సారించింది. 49 పుష్పక్‌ం ఏసీ బస్సులను నాలుగు రూట్లలో 24 గంటల పాటు నడపనున్నారు. ఎయిర్ పోర్టుకు వెళ్ళే వారు రూ.5260 తో నెలవారీ బస్‌పాస్‌ను తీసుకుంటే రోజు పుష్పక్ బస్సుల్లో తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. పుష్పక్ బస్సుల్లో రూ,300 చార్జీతో బస్ టికెట్ తీసుకున్న ప్రయాణికులు మూడు గంటల పాటు ఆ టికెట్‌తో సిటి బస్సుల్లో తిరగవచ్చని చెబుతున్నారు. మియాపూర్ ఎక్స్‌రోడ్, జెబిఎస్,సికింద్రాబాద్‌ల నుంచి పుష్పక్ ఏసీ బస్సుల ఆపరేషన్‌ను అధికారులు నిర్వహిస్తున్నారు. మియాపూర్ నుంచి ఎయిర్ పోర్టుకు 90 నిమిషాల్లో బస్సు చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News