Friday, November 15, 2024

శంషాబాద్ ఎయిర్‌పోర్టు సరికొత్త రికార్డు

- Advertisement -
- Advertisement -

శంషాబాద్ ఎయిర్‌పోర్టు సరికొత్త రికార్డు సృష్టించింది. మే నెలలో అత్యధిక స్థాయిలో ప్రయాణీకులు ప్రయాణం చేశారు. గత నెలలో ఏకంగా 2.3 మిలియన్ల మంది ప్రయాణం చేసి రికార్డ్ సృష్టించారు. జిఎంఆర్ ఎయిర్‌పోర్ట్ ఇన్‌ష్రాస్ట్రక్చర్ లిమిటెడ్ విడుదల చేసిన నెలవారీ నివేదిక ప్రకారం శంషాబాద్‌లో ఉన్న రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మే 2024లో 2.3 మిలియన్ల మంది ప్రయాణీకులు ప్రయాణం చేసినట్లు తెలిపింది. అత్యధిక స్థాయిలో ప్రయాణం చేయడంతో సరికొత్త రికార్డ్ నమోదు చేసింది.

మే 18, 2024న అత్యధికంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 82,300 మంది ప్రయాణీకులు ప్రయాణం చేసినట్లు పేర్కొంది. ఈ ఏడాది ప్రయాణీకుల రద్దీ 11 శాతం పెరిగినట్లు వెల్లడించింది. ఇక దేశీయ ట్రాఫిక్ 10 శాతం పెరగగా, అంతర్జాతీయ ట్రాఫిక్ 14 శాతం పెరిగిందని వెల్లడించింది. ఇక మే 4న 548 విమానాల రాకపోకలు జరిగాయి. ఇదిలా ఉంటే ఇటీవలే జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అవార్డులు వచ్చాయి. న్యూఢిల్లీలో జరిగిన ఎసిఆర్‌ఇఎక్స్ హాల్ ఆఫ్ ఫేమ్ జాతీయ స్థాయి అవార్డులను గెలుచుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News