Thursday, January 23, 2025

శంషాబాద్ లో ప్రియురాలి ప్రాణం తీసిన పంతులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సుల్తాన్‌పల్లిలో శుక్రవారం ఉదయం దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రియురాలు అప్సరను ప్రియుడు సాయి కృష్ణ చంపిన అనంతరం మృతదేహాన్ని సరూర్ నగర్ తీసుకొచ్చి మ్యాన్‌హోల్‌లో పడేశాడు. అప్సర కనిపించడంలేదని పోలీస్ స్టేషన్‌లో పూజారి వెంకటసాయి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి సిసి ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా పూజారి వెంటకసాయి హంతకుడిని పోలీసులు తేల్చారు. జూన్ 3న అప్సరను ప్రియుడు హత్య చేసినట్లు గుర్తించారు. కొన్నాళ్లుగా అక్క కుమార్తె అప్సరతో సాయికి అక్రమ సంబంధం ఉన్నట్టు సమాచారం. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో అప్సరను పూజారి హత్య చేసినట్టు సమాచారం. పూజారి సాయికి గతంలో పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Also Read: ఈటలకు బిజెపి హైకమాండ్ నుంచి పిలుపు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News