- Advertisement -
సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్‌వార్న్ తన కుమారుడితో బైక్‌పై ప్రయాణిస్తుండగా ఆదివారం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వార్న్ తన కుమారుడు జాక్సన్‌తో కలిసి 300 కిలోల బరువు ఉన్న బైక్‌పై మెల్బోర్న్లో ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. కాలికి చిన్న గాయం కావడంతో ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకున్నాడు. ఆదివారం రాత్రి సమయంలో భయంకరమైన నొప్పి రావడంతో స్థానిక ఆస్పత్రిలో చేరారు. గాయం చిన్నదే కాని నొప్పి ఎక్కువగా ఉండడంతో ఆస్పత్రిలో చేరానని వార్న్ తెలిపాడు. డిసెంబర్ 8 నుంచి జరగాల్సిన యాషెస్ సిరీస్‌లో కామెంటరీ వార్న్ ఉండనున్నాడు. ఒమిక్రాన్ వేరియంట్‌తో సిరీస్ నిర్వహణపై వేల్స్ క్రికెట్, ఆస్ట్రేలియా క్రికెట్ చర్చలు జరపనున్నారు.
- Advertisement -