బీజింగ్ : చైనాలో గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా వాణిజ్యనగరమైన షాంఘైలో కొత్తగా కరోనా మరణాలు కూడా నమోదు కావడం చైనా ప్రజలను భయపెడుతోంది. మరోవైపు కఠిన క్వారంటైన్ నిబంధనలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. షాంఘైలో ఆదివారం ఒక్క రోజే మూడు కరోనా మరణాలు నమోదైనట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ సోమవారం వెల్లడించింది. 89 నుంచి 91 ఏళ్ల వయసున్న ముగ్గురు వృద్ధులు కరోనా మహమ్మారితో ప్రాణాలు కోల్పోయినట్టు తెలియజేసింది. మృతులు వ్యాక్సిన్ తీసుకోలేదని పేర్కొంది.
ఈ ఏడాది మార్చి నుంచి షాంఘైలో కరోనా ఉధ్ధృతి మొదలైన విషయం తెలిసిందే.ఇప్పటివరకు 3.72 లక్షల కేసులు వెలుగు చూశాయి. ఆదివారం చైనా వ్యాప్తంగా 26,155 కేసులు నమోదవ్వగా, ఇందులో 95 శాతం అంటే 24,820 కేసులు ఒక్క ఈ నగరం లోనే బయటపడటం గమనార్హం. షాంఘైలో కరోనా కేసులు పెరగడంతో మార్చి 28 న దశల వారీగా ఆంక్షలు విధించారు. ప్రస్తుతం నగరం లోని 2.5 కోట్ల జనాభా కఠిన లాక్‌డౌన్‌లో ఉంది. లక్షణాలు ఉన్నా,లేకున్నా పాజిటివ్ వచ్చిందంటే ఆ వ్యక్తి కనీసం వారం రోజుల పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాల్సిందే. ఇందుకోసం నగర వ్యాప్తంగా 100 కు పైగా క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో దాదాపు 50 వేల వరకు పడకలను ఏర్పాటు చేశారు. అయితే ఈ సెంటర్లలో సరైన వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతన్నారు.
చాలా కేంద్రాల్లో పైకప్పు సరిగా లేక వర్షం పడితే నీళ్లు లోపలికి వస్తున్నాయి. ఇక 24 గంటలూ లైట్లు ఆన్‌లోనే ఉండటంతో నిద్ర పట్టడం లేదని బాధితులు వాపోతున్నారు. కనీసం స్నానానికి వేన్నీళ్లు కూడా దొరకడం లేదు. కొన్ని చోట్ల ఆహార కొరత, చికిత్సలో ఆలస్యం వంటి సమస్యలు ఉన్నాయి. పై నుంచి నీళ్లు పడి బెడ్లు తడిచిపోతున్నాయి,. చాలామంది