Wednesday, January 1, 2025

భక్తులతో కిటకిటలాడిన శనిఘాట్

- Advertisement -
- Advertisement -

కొండాపూర్‌: శని అమావాస్య పర్వదినంతో శనిఘాట్ దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. కొండాపూర్ మండల పరిథిలోని మాందాపూర్‌లోని శనిఘాట్ దేవస్థానంలో శని అమావాస్య సందర్బంగా భక్తులు పెద్ద ఎత్తున ఉదయం నుండే తరలి వచ్చి శని దేవునికి ప్రత్యేక పూజలు, శని నివారణ పూజలు చేశారు. సంగారెడ్డి జిల్లా నుండే కాకుండా వికారాబాద్, హైద్రాబాద్ జిల్లాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. శని నివారణ పూజల కోసం పెద్ద ఎత్తున భక్తులు వచ్చారని, భక్తులకు ఇబ్బంది లేకుండా పూజలు చేయించి ఉచిత అన్నదాన ప్రసాదాలు అందించామని ఆలయ పూజారి పరమేశ్వర స్వామి తెలిపారు.

సైదాపూర్‌లో…
శని అమావాస్య సందర్బంగా సైదాపూర్‌లోని శని దేవాలయంలో శని దేవునికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఉదయం నుండే శనిదేవాలయానికి తరలి వచ్చి శని దేవునికి నువ్వుల నూనెతో తైలాభిషేకాలు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఉచిత అన్నదానం నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారని ఆలయ నిర్వాహకుడు దర్శన్‌స్వామి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News