హైదరాబాద్: రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు బాధాకరమైన విషయమని బిఆర్ఎస్ ఎంఎల్ఎ బానోత్ శంకర్ నాయక్ తెలిపారు. రేవంత్ రెడ్డి పాదయాత్రలో వారు ఏం చేస్తారో చెప్పుకోవాలి కానీ ఇష్టంచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి బతుకేందో ఆలోచించుకో..!
క్యారెక్టర్ లేదని, కనీసం ఎథిక్స్ లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రగతి భవన్ పేల్చాలన్న రేవంత్ రెడ్డి నక్సలైటా? రౌడీయా? అని అడిగారు. సిఎం కెసిఆర్, తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి కాదని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని శంకర్ నాయక్ హెచ్చరించారు.
తాను వద్దంటే మా వాళ్ళు ఆగారని, లేదంటే వేరే పరిస్థితి ఉండేదని, మానుకోట రాళ్ళ రుచి తెలుసుకోవాలని,
సంస్కరం లేని వ్యక్తి రేవంత్ అని ఆగ్రహం వ్యక్వం చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిందని, గతంలో మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదన్నారు. పరిపాలన బాగుండాలని ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్, సచివాలయం, ఎన్నో నూతన భవనాలు నిర్మిస్తున్నామన్నారు.
పాదయాత్ర చేసేటప్పుడు సిఎం కెసిఆర్ చేసిన అభివృద్ధి కనిపించలేదా? అని అడిగారు. మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామాలను సుస్థిర అభివృద్ధి చేసిన దృశ్యాలు రేవంత్ కు కనిపించలేదా? లేక అభివృద్ధిపై మాట్లాడే ధైర్యం లేదా? అని ప్రశ్నించారు. సోయితో మాట్లాడాలని రేవంత్ ను చూసి కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని శంకర్ నాయక్ ఎద్దేవా చేశారు. ఇలానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మానుకోట పవర్ చూపిస్తామని హెచ్చరించారు. తాటాకు చప్పులకు భయపడే వాన్ని కాదని, కెసిఆర్ నాటిన మొక్క ఈ శంకర్ నాయక్ అని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన రోజు నుంచి ఆ పార్టీ పెద్దలను సమన్వయం చేసుకోలేని అసమర్థుడివని చురకలంటించారు. గుర్తుపెట్టుకో… 2023 లో మానుకోటలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు.