Monday, December 23, 2024

నేను, కెసిఆర్ ఒక్క కార్తీలో పుట్టాం…. వేట మొదలైంది…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ మాజీ ఎంఎల్‌ఎ శంకర్ నాయక్ సంచలన కామెంట్స్ చేశారు. తన పార్టీలో ఉంటూనే తనని మోసం చేశారని మండిపడ్డారు. మీకు ధైర్యం ఉంటే బిఆర్‌ఎస్ కార్యకర్తను ముట్టుకోవాలని, తరువాత ఏమైతదో చూసుకోవాలన్నారు. ఎంఎల్‌ఎ పదవి ఉంది కాబట్టి ఆలోచించానని, ఇప్పుడు మనల్ని ఆపేటోడు లేడని సవాల్ విసిరారు. మహబూబాబాద్ లో శంకర్ నాయక్ ప్రసంగించారు. తాను, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక్క కార్తెలోనే పుట్టామని, వేట మొదలైందని… ఒక్కోక్కడిని ఆట ఆడుకుంటామని హెచ్చరించారు.

ఇప్పటికే తనకు 55 సంవత్సరాల వయసు ఉందని తనని ఏం చేస్తారని, బిఆర్‌ఎస్ కార్యకర్తలను కాపాడుకునే సత్తా తనకు ఉందని, రాత్రి 12 గంటలకు కార్యకర్తలకు ఆపద వచ్చిందని ఫోన్ చేస్తే చాలు స్పందించడంతో అండగా ఉంటానని భరోసానిచ్చారు. అయ్యప్ప స్వామి మాలలో తాను ఉన్నానని, ప్రత్యర్థులు తనపై అసభ్యపదజాలం ప్రయోగించారని శంకర్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎవరి జోలికి పోనని, బిఆర్‌ఎస్ కార్యకర్తలు, తన జోలికి వస్తే వదిలిపెట్టానని హెచ్చరించారు. బిఆర్‌ఎస్ కార్యకర్తకు ఆపద వస్తే మెరుపు వేగంతో అండగా నిలబడతానని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News