Sunday, December 22, 2024

పార్టీ ఎన్నికల కోసం లక్ష రూపాయల చెక్కు అందించిన శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి ఎన్నికల ప్రచార ఖర్చులకోసం తన వంతుగా తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ లక్ష రూపాయల చెక్కును బిఆర్‌ఎస్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు అందించారు. శనివారం హైదరాబాద్లో మంత్రి కెటిఆర్‌ని మంత్రి జగదీశ్ రెడ్డి తో కలిసి లక్ష రూపాయల చెక్కును పార్టీకి శంకరమ్మ అందించారు. ఈసారి తిరిగి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శంకరమ్మను మరింత గౌరవప్రదమైన స్థానంలో నిలిపే బాధ్యతను తాను స్వయంగా తీసుకుంటానని ఈ సందర్భంగా కెటిఆర్ శంకరమ్మకు తెలియజేశారు. తెలంగాణ కోసం త్యాగం చేసిన అమరవీరుల ఆశయాల సాధన కోసం మరోసారి మన పార్టీ గెలవాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా కెటిఆర్‌కి శంకరమ్మ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News