Friday, April 25, 2025

రాజీవ్ హత్యకేసులో జైలుశిక్ష అనుభవించిన శాంతన్ మృతి

- Advertisement -
- Advertisement -

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించిన శాంతన్ మరణించాడు. ఆయన వయసు 55 ఏళ్లు. కాలేయవ్యాధితో బాధపడుతున్న శాంతన్ కొన్నిరోజులుగా తమిళనాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. శాంతన్ స్వస్థలం శ్రీలంక.

1991లో జరిగిన రాజీవ్ హత్య కేసులో శాంతన్ సహా ఏడుగురికి కోర్టు మరణశిక్ష విధించింది. అయితే కొన్నేళ్ల తర్వాత శాంతన్ తోపాటు మరో ఇద్దరి మరణశిక్షను కోర్టు యావజ్జీవ శిక్షగా మార్చింది. శాంతన్ 2022లో విడుదలయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News