Wednesday, January 22, 2025

శపథం సినిమా పోస్టర్ విడుదల… కుట్రలకీ-ఆలోచనలకీ మధ్య…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వ్యూహం మూవీపై రామ్‌గోపాల్ వర్మ అప్‌డేట్ ఇచ్చారు. జనవరి 25న వ్యూహం 1 సీక్వెల్ శపథం సినిమాను విడుదల చేస్తామని వెల్లడించారు. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మూవీ పోస్టర్లను తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఆర్‌జి ట్వీట్‌కు సోషల్ మీడియాలో భారీగా స్పందన వస్తుంది. కుట్రలకీ-ఆలోచనలకీ మధ్య వార్‌గా అభివర్ణించారు. ఈసినిమా ట్వీట్‌కు నెటిజన్లు అనుకూలంగా, వ్యతిరేకంగా స్పందిస్తున్నారు.

ఆర్‌జివి సినిమాలను వైసిపి కార్యకర్తలకు కంటే ఎక్కువగా టిడిపి కార్యకర్తలు చేస్తారని ఎం ఉదయ్ క్రిష్ణ అనే నెటిజన్ కామెంట్ చేశారు. నిజజీవిత సినిమాలు ఆర్‌జివి తీసినట్టు ఎవరు తీయలేదరని అమర్‌నాథ్ రెడ్డి కామెంట్ చేశారు. బెంగళూరు ప్యాలెస్, చెన్నై ప్యాలెస్, హైదరాబాద్ ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్, వైజాబ్ ప్యాలెస్ పేరుతో సినిమా తీస్తే బాగుంటుందని చరణ్ సాయి తేజా అనే వ్యక్తి కామెంట్ చేశారు. వైఎస్ వివేకానందా మర్డర్ మీద ఒక సినిమా తీయాలని రామకృష్ణ అనే వ్యక్తి సూచించారు. సంతకాల సేకరణ, బాబాయ్ మర్డర్, కోడి కత్తి వంటి సినిమాలు తీస్తే ఇంకా బాగుంటుందని శ్రవణ్ అనే నెటిజన్ ఘాటుగా స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News