Monday, December 23, 2024

‘ఐటి జాబ్‌కు నై’.. తెలంగాణ పథకాలకు ‘జై’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ విధానాలకు ఆకర్శితుడై సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల జీతం వచ్చే ఐటి కొలువును తృణ-ప్రాయంగా వదిలిపెట్టాడో యువకుడు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ పక్షాన పనిచేసేందుకు ముందుకు రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ముఖ్యంగా రైతుల పట్ల సిఎం కెసిఆర్ ఇస్తున్న ప్రాధాన్యత, వ్యవసాయ రంగం అభివృద్ధికి అందిస్తున్న చేయూత.. ఆ యువకుడిని బాగా ఆకర్శించింది. ఆ పథకాలు మహారాష్ట్రలో కూడా అందితే రైతుల దశ మారుతున్న ఉద్దేశ్యంతో తన ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి.. బిఆర్‌ఎస్ పక్షాన పనిచేయాలని నిర్ణయించుకున్నారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్, నివ్‌దుంగే గ్రామానికి చెందిన శరద్ మర్కడ్ ఒక సాధారణ రైతు కుటుంబం లో జన్మించారు. తల్లిదండ్రులకు కేవలం ఒకటిన్నర ఎకరం పొలం మాత్రమే ఉండడంతో జాగ్రత్తగా ఇంటిని నడుపుకుంటూ వచ్చారు. పేదరికం కారణంగా శరద్ చదువుకు కావాల్సిన డబ్బును కూడా అతి కష్టంగా తల్లిదండ్రులు కూడబెట్టేవారు. కాగా శరద్ తన పాఠశాల జీవితం నుంచే తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తున్నప్పుడు రైతులు పడుతున్న ఇబ్బందులు, రైతుల పక్షాన ఉద్యమం కోసం కూడా పనిచేయాలని నిర్ణయించుకున్నారు.

తన జీవితాన్ని రై తులకే అంకితం చేస్తానని అప్పట్లోనే ప్ర తిజ్ఞ చేశారు. 12వ తరగతి సైన్స్ క్లాస్ లో మంచి మార్కులు తెచ్చుకుని కంప్యూటర్‌లో డిగ్రీ చదివాడు. చదవుకు కావాల్సిన డబ్బు కోసం ఒక టెక్స్‌టైల్ షాపులో పనిచేస్తూ డిగ్రీ పూర్తి చేశారు. అందులో ఆయన ఎ క్లాస్‌లో పాస్ అయ్యాడు. 2019లో మహారాష్ట్రలో కరువు విలయతాండవం చేసింది. రైతుల పంటలు నాశనమయ్యాయి. పశువులకు తాగడానికి నీరు లేదు…. మేత కూడా దొరకలేదు. అటువంటి పరిస్థితిలో శరద్ మహారాష్ట్రలో మొట్టమొదటి అన్ ఎయిడెడ్ పశుగ్రాస శిబిరాన్ని ప్రారంభించారు. దాదాపు వంద జంతువుల కరువు తీరేవరకూ ఉచితంగా చూసుకున్నారు. అయన వయస్సు అప్పటికి 19 సంవత్సరాలే ఉండడం విశేషం. తదనంతరం రైతుల కోసం అప్పుడే ఢిల్లీలో ఆందోళనలు జరిగాయి. గత సంవత్సరంలో పశువులకు సంబంధించిన లంపస్కిన్ వ్యాధి కూడా దేశంలో ప్రబలింది. ఈ సంక్షోభంలో దేశంలోనే మొదటి లంపస్కిన్ క్వారంటైన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. పశువులను రక్షించడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. అతని ప్రయత్నాలకు రాష్ట్రం నలుమూలల నుంచి మంచి స్పందన లభించింది.

రైతుల చందాలు వేసుకుని ఈ పని కోసం శరద్‌కు రూ. 30 లక్షల విలువైన కారును కూడా ఇచ్చారు. అంతకు ముందు సైకిల్‌పై వచ్చి ప్రజలకు కావాల్సిన పనులు చేసేవారు. కాగా శరద్‌కు ఐటి కంపెనీలో సంవత్సరానికి 4.8 లక్షల జాబ్ ఆఫర్ వచ్చింది. కానీ అతను ఈ ఉద్యోగం చేయడానికి నిరాకరించాడు. రెండు రోజుల క్రితం మాణిక్ కదమ్ నేతృత్వంలో తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిశారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి మోడల్‌ను ఆయన స్వయంగా చూశారు. రైతుల కోసం కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు, తెలంగాణవలో రైతులకు ఇస్తున్న పథకాలు మహరాష్ట్ర రైతులకు అందాలన్న లక్షంతో ఉద్యోగానికి టాటా చెప్పారు. అనంతరం సిఎం కెసిఆర్‌తో నేతృత్వంలో బిఆర్‌ఎస్ పార్టీలో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News