Monday, January 20, 2025

ఎన్‌సిపి వర్కింగ్ ప్రెసిడెంట్స్‌గా సుప్రియ, ప్రఫుల్ పటేల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్‌గా సుప్రియా సూలె, ప్రఫుల్ పటేల్ పేర్లను ఆ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ శనివారం ప్రకటించారు.

తాను, పిఎ సంగ్మా 1999లో ఏర్పాటు చేసిన ఎన్‌సిపి 25వ వార్షికోత్సవం సందర్భంగా శరద్ పవార్ ఈ ప్రకటన చేశారు. ఎన్‌సిపిలో కీలక నాయకుడైన అజిత్ పవార్ సమక్షంలో పవార్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు శరద్ పవార్ గత నెలలో చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. అయితే పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయనే అధ్యక్ష పదవిలో కొనసాగాలని ముక్తకంఠంతో కోరారు. దీంతో పవార్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News