Monday, January 20, 2025

సుప్రీం కోర్టును ఆశ్రయించిన శరద్ పవార్

- Advertisement -
- Advertisement -

అజిత్ పవార్ వర్గానికి అసలైన ఎన్‌సిపిగా గుర్తింపు
ఇసి ఉత్తర్వును సవాల్ చేసిన శరద్ పవార్

న్యూఢిల్లీ : మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని పార్టీని అసలైన నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)గా గుర్తిస్తూ ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వును వెటరన్ నేత శరద్ పవార్ సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. శరద్ పవార్ తన వ్యక్తిగత హోదాలో న్యాయవాది అభిషేక్ జెబరాజ్ ద్వారా సోమవారం సాయంత్రం పిటిషన్ దాఖలు చేశారు. ఆయన కన్నా ముందు అజిత్ పవార్ వర్గం సుప్రీం కోర్టులో ఒక కేవియట్ దాఖలు చేసింది.

శరద్ పవార్ వర్గం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఆయనకు అనుకూలంగా ఎక్స్‌పార్టీ ఉత్తర్వు ఏదీ జారీ చేయరాదని కోరుతూ అజిత్ పవార్ వర్గం న్యాయవాది అభికల్ప్ ప్రతాప్ సింగ్ ద్వారా కేవియట్ దాఖలు చేసింది. అజిత్ పవార్ వర్గం అసలైన ఎన్‌సిపి అని ఎన్నికల కమిషన్ ఈ నెల 6న ప్రకటించింది. ఇసి ప్రకటన పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్‌కు షాక్ ఇచ్చింది. ఎన్నికల కమిషన్ ఎన్‌సిపి గుర్తు ‘గడియారం’ను కూడా అజిత్ పవార్ వర్గానికి కేటాయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News