- Advertisement -
ముంబై : ప్రతిపక్ష పార్టీల నేతలపై ఒత్తిడిని పెంచడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ప్రభుత్వం వినియోగిస్తోందని, గతంలో ఎప్పుడూ ఇంతలా ఏ ప్రభుత్వం వినియోగించలేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్‌పవార్ విమర్శించారు. కేవలం మహారాష్ట్ర లోనే కాదు, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, జార్ఖండ్, తమిళనాడు ఇలా బిజెపియేతర పార్టీల అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే తరచుగా ఈడి దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వం కొవిడ్‌పై సరిగ్గా స్పందించడం లేదని బిజెపి ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగడంపై స్పందిస్తూ కొవిడ్ నియమావళిని బిజెపి కూడా పాటించాలని, ప్రతిపక్ష పార్టీలకే ఆ నియమావళిని పరిమితం చేయరాదని సూచించారు. కొవిడ్‌పై మహారాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొంటున్నా కొంతమంది అకారణంగా నిరసనకు దిగుతున్నారని వ్యాఖ్యానించారు.
- Advertisement -