Monday, January 20, 2025

82 కానీ 92 కానీ నేనే స్ట్రాంగ్: శరద్ పవార్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : నా వయస్సు గురించి నీకు ఎందుకు? 82 కానీ 92 కానీ ధీటుగానే ఉంటానని అన్నకొడుకు అజిత్ పవార్‌కు సీనియర్ నేత శరద్ పవార్ కౌంటర్ ఇచ్చారు. ఒక్కరోజు క్రితం అజిత్ పవార్ తన బాబాయ్ శరద్ పవార్‌ను ఉద్ధేశించి 82 ఏండ్లు వచ్చాయి. ఇక ఇంట్లో విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని పేర్కొనడంపై పవార్ గురువారం ఘాటుగా స్పందించారు. శరద్ పవార్ పిలుపుతో గురువారం ఇక్కడ ఎన్‌సిపి జాతీయ కార్యవర్గ సమావేశం ఆయన నివాసంలో ఏర్పాటు అయింది. ఈ క్రమంలో ముందుగా పార్టీ నుంచి అజిత్ పవార్‌తో పాటు 12 మంది రెబెల్స్‌ను తొలిగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రఫుల్ పటేల్‌పై కూడా పవార్ వర్గం వేటేసింది.

ఆ తరువాత శరద్ పవార్ మాట్లాడుతూ నమ్మినందుకు మోసం చేశారని అజిత్‌పై విమర్శలు చేస్తున్నారు కదా అని విలేకరులు ప్రశ్నించగా , దీనిపై తానేమీ మాట్లాడేది లేదని, తనకు పార్టీయే సుప్రీం అని, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని, ఇతరులు కూడా ఇదే పాటించాల్సిందే అన్నారు. ఇప్పుడు ఎవరో వచ్చి తాను పార్టీ ప్రెసిడెంట్‌ను అని చెపితే నమ్మేదెవ్వరూ లేరని పవార్ ఈ దశలో అజిత్ పవార్‌పై విరుచుకుపడ్డారు. ఈ పార్టీని స్థాపించింది తానేనని, ఇది తనదే అని ఎవరో చెపితే అది తప్పే అవుతుంది. వారు చెప్పేదాంట్లో నిజాలు లేవన్నారు. ఎవరో ఒకరు ఏదో ఒకటి చెపితే దీనికి ప్రాధాన్యత ఎందుకు ఇస్తారని విలేకరులను ఆయన నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News