Sunday, January 19, 2025

నాడు సుప్రీం బహిష్కరించిన వ్యక్తి.. నేడు హోం మంత్రి : అమిత్‌షాకు పవార్ కౌంటర్

- Advertisement -
- Advertisement -

ముంబై : “రాజకీయాల్లో అవినీతికి రింగ్‌లీడర్” అని కేంద్రహోం మంత్రి అమిత్‌షా తనపై చేసిన వ్యాఖ్యలకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్‌పవార్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. గతంలో ఓ కేసు విషయంలో గుజరాత్ నుంచి రెండేళ్లపాటు సుప్రీం కోర్టు బహిష్కరించిందని, అటువంటి వ్యక్తి దేశంలో అత్యంత ముఖ్యమైన హోం మంత్రిత్వశాఖకు మంత్రిగా ఉండడం విచిత్రం కలిగిస్తోందని శరద్ పవార్ తీవ్రంగా వ్యాఖ్యానించారు.

“కొన్ని రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని అవినీతిపరులందరికీ కమాండర్ తానని వ్యాఖ్యానించారు. చట్టాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై గుజరాత్ నుంచి సుప్రీం కోర్టు రెండేళ్ల పాటు బహిష్కరించింది. అలాంటి వ్యక్తి ఇప్పుడు దేశానికి హోం మంత్రిగా ఉండడం నిజం విచిత్రంగా ఉంది.దీనిని బట్టి మనదేశం ఎలాంటి వారి చేతిలో ఉందో ఆలోచించుకోవాలి. లేకుంటే నూటికి నూరు శాతం వారు దేశాన్ని పొరపాటు మార్గంలో నడిపిస్తారు” అని వ్యాఖ్యానించారు.

“2010లో సొహ్రాబుద్దీన్ షేక్ బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో అమిత్‌షా గుజరాత్ రాష్ట్రం నుంచి రెండేళ్లు సుప్రీం కోర్టు బహిష్కరణకు గురయ్యారు. తరువాత 2014లో నిర్దోషిగా విడుదలయ్యారు” అని పవార్ గుర్తు చేశారు. అంతకు ముందు జులై 21న పుణెలో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో శరద్ పవార్‌పై కేంద్రమంత్రి అమిత్ షా తీవ్రంగా విమర్శలు చేశారు. పాలపొడిని దిగుమతి సర్కులర్ రాష్ట్రంలో ప్రచారం కావడంపై విపక్షాల కూటమిని, మహావికాస్ అఘాడీ(ఎంవిఎ)ని కూడా విమర్శించారు. శరద్ పవార్ పార్టీ అధికారం లోకి వస్తే మరాఠా రిజర్వేషన్ అమలు కాకుండా పోతుందని, తాము అధికారం లోకి వచ్చేలా ఓటు వేస్తే మరాఠా రిజర్వేషన్ కొనసాగిస్తామని అమిత్‌షా హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News