రాజ్‌థాకరేకు పవార్ చురకలు
నిరుదముంబై : లౌడ్‌స్పీకర్లు మైక్‌లు, కులం మతం పేరిట భావోద్వేగాలు రెచ్చగొట్టడం వల్ల కీలక ప్రజాసమస్యలు తీరుతాయా? అని ఎన్‌సిపి నేత శరద్ పవార్ ప్రశ్నించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి ప్రధాన అంశాలను పక్కదోవపట్టించేందుకు కొన్ని శక్తులు కులం మతం అంశాలను ఆచార వ్యవహారాలను తెరపైకి తీసుకువస్తున్నాయని విమర్శించారు. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎస్) అధ్యక్షులు రాజ్ థాకరే ఔరంగాబాద్‌లో ప్రదర్శన చేపట్టాడానికి ముందు పవార్ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ప్రజలు ఎదుర్కొంటున్న పలు కీలక అంశాలు ఉన్నాయి. ధరల పెరుగుదల, ఆహారధాన్యాలు, నిరుద్యోగం వంటి పలు సమస్యలు ఉన్నాయి. అయితే ఎవరూ వీటి గురించి పట్టించుకుంటున్న దాఖలాలు కన్పించడం లేదని, కొందరు ఈ విధంగా ప్రార్థనా మందిరాలలో మైక్‌ల అంశాలు , ఇతరత్రా మత కుల విషయాలను ప్రస్తావిస్తూ పరిస్థితిని దిగజారుస్తున్నారని పవార్ వ్యాఖ్యానించారు.