Monday, December 23, 2024

అది రహస్య భేటీ కాదు కానీ..

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఎన్‌సిపి తిరుగుబాటు నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఆ పార్టీ చీఫ్ శరద్‌పవార్‌లు శనివారం రహస్యంగా సమావేశమయ్యారన్న వార్త ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. పుణె కోరెగావ్‌ప్రాంతంలో ఉన్న ఓ వ్యాపారవేత్త నివాసంలో వీరిద్దరూ సమావేశమ్యారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆ ఇంటికి వచ్చిన శరద్ పవార్ ఆ తర్వాత సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అక్కడినుంచి తిరిగి వెళ్లారు. కాగా సాయంత్రం 6.45గంటలకు అజిత్ పవార్ మీడియా కంట బడకుండా జారుకున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపారవేత్త నివాసంలో రహస్యంగా కలుసుకున్న వీరిద్దరూ దాదాపు 5 గంటల పాటు ఏం మాట్లాడుకున్నారనే దానిపై సస్పెన్స్ నెలకొంది.

మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి మలుపుతిరగనున్నాయా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాగా ఇదేమీ రహస్య మీటింగ్ కాదని ఎన్‌సిపి రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పటేల్ ఆదివారం మీడియాతో అన్నారు. అజిత్ పవార్‌తో కలిసి తాను కూడా ఆ ఇంటికి వెళ్లినట్లు చెప్పారు. అయితే తాను త్వరగా అక్కడినుంచి వెళ్లినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో అజిత్, శరద్‌పవార్‌ల మధ్య ఏం సంభాషణ జరిగిందో తనకు తెలియదన్నారు. నాలుగు రోజలు కింద తన సోదరుడికి ఓ కంపెనీకి సంబంధించిన వివరాలు తెలియజేయాలని కోరుతూ ఇడినుంచి నోటీసు వచ్చిందని, ఆయన ఆ వివరాలు అందించారన్నారు. కాగా ఇడి నోటీసుకు, ఈ సమావేశానికి ముడిపెట్టడం సరికాదని ఆయన అన్నారు. కాగా ఎన్‌సిపి చీలిపోలేదని, ఇప్పటికీ తమ నాయకుడు శరద్ పవారేనని రెండు వర్గాలు చెబుతున్నాయని జయంత్ పటేల్ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News