- Advertisement -
సిఎం రిలీఫ్ ఫండ్‌కు చెక్కు అందజేత
ముంబయి: ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్ గురువారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను ఆయన అధికారిక నివాసం వర్షలో కలుసుకున్నారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో ప్రముఖ విద్యా సంస్థ రాయత్ శిక్షణ్ సంస్థ తరఫున రూ. 2.36 లక్షల చెక్కును పవార్ ముఖ్యమంత్రి సహాయ నిధి నిమిత్తం థాకరేకు అందచేశారు. మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ సీతారాం కుంతే కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అధికార మహా వికాస్ అఘాడి(ఎంవిఎ)లో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న ఈ రెండు పార్టీల నాయకులు సమావేశం కావడంతో వివిధ అంశాలపై ఊహాగానాలు వినిపించాయి. అయితే రాయత్ శిక్షణ్ సంస్థ చైర్మన్‌గా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 2.36 చెక్కును అందచేశానని, ఇది సంస్థ సిబ్బంది ఒకరోజు వేతనం కింద సేకరించిన మొత్తమని థాకరేతో సమావేశం అనంతరం పవార్ ట్వీట్ చేశారు.
- Advertisement -