Thursday, January 23, 2025

శరద్‌ను నిలదీసిన అజిత్ పవార్..

- Advertisement -
- Advertisement -

ముంబై : ఢిల్లీలో శరద్‌పవార్ ఎన్‌సిపి జాతీయ కార్యవర్గ సమావేశం ఏ హోదాలో ఏర్పాటు చేస్తారని అజిత్ పవార్ వర్గం నిలదీసింది. శరద్ పవార్‌ను పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతల నుంచి తీసివేశామని, అంతకు ముందే తమ పార్టీ నేతగా అజిత్ పవార్ ఎన్నిక జరిగిందని, తమకే సంఖ్యాబలం ఉందని నిరూపితం కానుందని, మరి శరద్ పవార్ ఆహ్వానిత భేటీకి చట్టబద్ధత ఉందా? అని ప్రశ్నించారు. ఇప్పటికే అజిత్ తమదే ఎన్‌సిపి అని తెలియచేసే ఆధారాలతో ఎన్నికల సంఘాన్ని సంప్రదించారని, తగు సంఖ్యాబలాన్ని చూపారని, ఇప్పటికే ఈ విషయం దాదాపుగా నిర్థారితం అయిందని, మరి ఇప్పుడు శరద్ పవార్ చేతలకు అర్థం ఏమిటని అజిత్ పవార్ పేరిట వెలువడ్డ ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News