Friday, December 20, 2024

బిజెపితో శరద్ పవార్ ఎన్నటికీ చేతులు కలపరు: సంజయ్ రౌత్

- Advertisement -
- Advertisement -

ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి) అధ్యక్షుడు శరద్ పవార్ తన జీవితంలో బిజెపితో చేతులు కలపబోరని శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్  స్పష్టం చేశారు.

వచ్చే ఏడాది స్వాంత్య్ర దినోత్సవం నాడు ఢిల్లీలోని ఎర్రకోటపై నుంచి ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన ఒక ప్రధాన మంత్రి జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారని, ఆ శుభ ఘడియల కోసం దేశమంతా ఎదురుచూస్తోందని బుధవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ రౌత్ చెప్పారు. శరద్ పవార్ కంఠంలో ఊపిరి ఉన్నంతవరకు బిజెపితో చేతులు కలిపవే ప్రసక్తి ఉండబోదని ఆయన అన్నారు. ఆయన పార్టీ నిర్మాణంలో బిజీగా ఉన్నారని రౌత్ తెలిపారు.

శరద్ పవార్ అధ్యక్షతలోని ఎన్‌సిపి మహారాష్ట్రలో ప్రతిపక్ష శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం), కాంగ్రెస్‌తో కలిసి ఎంవిఎ పేరిట కూటమిలో ఉంది. ఎన్‌సిపిపై తిరుగుబాటు చేసి వేరుపడిన శరద్ వవార్ అన్న కుమారుడు అజిత్ పవార్ ఏక్‌నాథ్ సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల అజిత్ పవార్ శరద్ పవార్‌తో రహస్యంగా భేటీ కావడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది.

తమ భేటీలో అజిత్ పవార్ శరద్ పవార్‌కు ఏదైనా ప్రతిపాదన పెట్టి ఉంటారా అని విలేకరులు ప్రశ్నించగా శరద్ పవార్ ముందు ప్రతిపాదన పెట్టేంత పెద్ద నాయకుడు అయ్యారా అజిత్ పవార్ అంటూ రౌత్ వ్యాఖ్యానించారు. శరద్ పవార్ నాలుగుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అనేకసార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారని, అజిత్ పవార్‌ను మంత్రిని చేసిన ఘనత శరద్ పవార్‌కే దక్కుతుందని రౌత్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News