Tuesday, September 17, 2024

సిఎం అభ్యర్థి పేరు ఇప్పుడే అవసరం లేదు:శరద్ పవార్

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే ముఖ్యమంత్రి అభ్యర్థిని మహా వికాస్ అఘాడీ(ఎంవిఎ) ప్రకటించాల్సిన అవసరం లేదని కూటమిలో భాగస్వామ్య పక్షమైన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి శరద్ పవార్) అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ స్పష్టం చేశారు. బుధవారం కోల్హాపూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి ఎవరన్నది నిర్ణయిస్తామని అన్నారు. కూటమిలో ఏ పార్టీకి అధిక సీట్లు వస్తాయో ఆ పార్టీ నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయిస్తామని ఆయన తెలిపారు. సాధ్యమైనంత త్వరగా సీట్ల సర్దుబాటు ఒప్పందం కుదుర్చుకుని ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని తాను ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సెప్టెంబర్ 7 నుంచి 9వ తేదీ లోపు ఎంవిఎ నాయకులు కూర్చుని సీట్ల పంపకాన్ని ఖరారు చేయాలని ఆయన సూచించారు. నవంబర్ రెండవ వారం నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని తాను ఊహిస్తున్నట్లు ఆయన తెలిపారు. శివసేన(యుబిటి), ఎన్‌సిపి(ఎస్‌పి), కాంగ్రెస్‌తో కూడిన ఎంవిఎ జరిపే చర్చలలో సీపెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ(పిడబ్లుపి), సిపిఐ, సిపిఎంను కూడా చేర్చుకోవాలని ఆయన కోరారు. ఈ పాక్టీలకు కొన్ని ప్రాంతాలలో బలం ఉందని, లోక్‌సభ ఎన్నికలలో ఈ పార్టీలు ఎంవిఎకి సాయపడ్డాయని పవార్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News