Saturday, November 23, 2024

ఎన్‌సిపిపై వారి నిర్ణయాలు ‘అన్యాయం’..

- Advertisement -
- Advertisement -

బారామతి : నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) వ్యవహారంపై ఎన్నికల కమిషన్ (ఇసి), మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ ఇచ్చిన తీర్పులు ‘అన్యాయం’ అని ఎన్‌సిపి వ్యవస్థాపకుడు శరద్ పవార్ శనివారం ఆక్షేపించారు. పార్టీ పేరు, చిహ్నం తిరిగి సాధించేందుకు తన వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయిస్తుందని శరద్ పవార్ ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గమే అసలైన ఎన్‌సిపి అని స్పీకర్ నర్వేకర్ గురువారం తీర్పు వెలువరించడం శరద్ పవార్ వర్గానికి ఎదురుదెబ్బ అయింది. ఆయన వర్గానికి ఇప్పుడు అధికారికంగా ఎన్‌సిపి (శరత్‌చంద్ర పవార్) అని నామకరణం చేశారు. పరస్పర ఎంఎల్‌లపై ప్రత్యర్థి వర్గాలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను కూడా స్పీకరర్ తిరస్కరించారు.

అజిత పవార్ నాయకత్వంలోని వర్గమే అసలైన ఎన్‌సిపి అని ఎన్నికల కమిషన్ తీర్పు చెప్పి పార్టీ పేరును, చిహ్నం ‘గడియారం’ను ఆయనకు కేటాయించిన కొన్ని రోజుల తరువాత స్పీకర్ తీర్పు వచ్చింది. శరద్ పవార్ పుణె జిల్లా తన సొంత పట్టణం బారామతిలో విలేకరులతో మాట్లాడుతూ, ‘మేము అటువంటి నిర్ణయాన్ని ఊహించాం. అసెంబ్లీ స్పీకర్ తన పదవి గౌరవాన్ని కాపాడుకోలేకపోయారు. ఎన్నికల కమిషన్, స్పీకర్ నిర్ణయాలు అన్యాయం. అందువల్ల ఎన్‌సిపి పేరు, చిహ్నం గురించి సుప్రీం కోర్టును ఆశ్రయిస్తున్నాం’ అని చెప్పారు.‘పార్టీని స్థాపించినవారికే ఉద్వాసన పలికారు. ఇలా ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదు. న్యాయ వ్యవస్థ ప్రకారం ఈ నిర్ణయం సరైనది కాదు. ఈ విషయమూ సుప్రీం కోర్టుకు వెళుతున్నాం. పార్టీని ఎవరు స్థాపించారో దేశం మొత్తానికి తెలుస్తుంది’ అని శరద్ పవార్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News