Tuesday, November 5, 2024

మన టార్గెట్ సావర్కర్ కాదు మోడీ: రాహుల్‌కు పవార్ హితవు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: హిందూత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్‌పై విమర్శల తీవ్రతను తగ్గించుకోవాలంటూ ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీని సూచించినట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన ప్రతిపక్ష పార్టీల నాయకుల సమావేశంలో శరద్ పవార్ ఈ సూచన చేసినట్లు తెలిసింది.

క్షమాపణ చెప్పడానికి తాను సావర్కర్‌ను కాను గాంధీనంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్రలో ఇటీవలి వరకు ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షమైన శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) అభ్యంతరం తెలియచేసిన దరిమిలా మహారాష్ట్ర అఘాడి వికాస్ కూటమిలో చీలికలు ఏర్పడే ప్రమాదం తలెత్తడంతో రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిర్చేందుకు శరద్ పవార్ ఉపక్రమించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా పల్గొన్న ఈ సమావేశంలో పవార్ మాట్లాడుతూ సావర్కర్‌పై విమర్శనాస్త్రాలను తగ్గించాలని సూచించగా కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా దీనికి అంగీకరించినట్లు తెలుస్తోంది.

మహారాష్ట్రలో మంచిపేరున్న వీర్ సావర్కర్‌ను విమర్శించడం వల్ల ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష కూటమికి మేలు జరగదని పవార్ చెప్పినట్లు తెలుస్తోంది. సావర్కర్ ఎన్నడూ ఆర్‌ఎస్‌ఎస్ సభ్యుడు కాదని కూడా రాహుల్ గాంధీకి పవార్ చెప్పినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాలు పోరాడాల్సింది ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపితోనే తప్ప సావర్కర్‌తో కాదని కూడా ఆయన నచ్చచెప్పినట్లు సమాచారం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News