Monday, January 20, 2025

ప్రధాని అభ్యర్థికి తొందరలేదు: శరద్‌ పవార్

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఇండియా కూటమికి కన్వీనర్‌ను నియమించే విషయంలో కూటమి సభ్యుల్లో ఎలాంటి వివాదం లేదని, అయితే లోక్‌సభ ఎన్నికలకోసం ఎవరినీ ప్రధాని అభ్యర్థిగా చూపాల్సిన అవసరం లేదని, ఫలితాలు వెల్లడయిన తర్వాత నేతలను ఎన్నుకుంటే బాగుంటుందని ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. శనివారం వర్చువల్‌గా జరిగిన ఇండియా కూటమి సమావేశంలో కన్వీనర్ పదవికి నితీశ్ కుమార్ పేరును సూచించడం జరిగిందని, అయితే కన్వీనర్‌ను నియమించాల్సిన అవసరం లేదని, పార్టీల అధ్యక్షులతో ఒక టీమ్‌ను ఏర్పాటు చేస్తే సరిపోతుందని నితీశ్ అన్నారని పవార్ అన్నారు. వర్చువల్ సమావేశంలో పాల్గొన్న అనంతరం పుణె జిల్లాలోని జున్నార్‌లో పవార్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.‘

ఓట్లు అడగడం కోసం ప్రధాని అభ్యర్థిని చూపించాల్సిన అవసరం లేదు. ఎన్నికల తర్వాత మేము నాయకుడ్ని ఎన్నుకుంటాం. బిజెపికి ప్రత్యామ్నాయాన్ని అందించగలమన్న నమ్మకం మాకు ఉంది.1977లో మొరార్జీ దేశాయిని ప్రతిపక్షం ప్రధానమంత్రి అభ్యర్థిగా చూపించలేదు’ అని ఆయన అన్నారు. అనేకపార్టీలు ఒక్క తాటిపైకి వస్తుండడం మంచి పరిణామమని పవార్ చెప్పారు. కాగా లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల అంశం చర్చకు రాలేదని, సీట్ల పంపిణీపై చర్చిస్తామని ఆయన చెప్పారు. కాగా అయోధ్యలో రామమందిరం అంశంపై పవార్ మాట్లాడుతూ అయోధ్యలో రామమందిరాన్ని ఎవరు కూడా వ్యతిరేకించడం లేదని, అయితే నిర్మాణం ఇంకా పూర్తి కాని ఆలయంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించడం వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాన్ని మాత్రమే ప్రశినస్తున్నారని పవార్ చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News