Friday, December 20, 2024

కష్టకాలంలో మోడీకి ఎంతో సాయం చేశాను

- Advertisement -
- Advertisement -

తనపై విమర్శలకు శరద్ పవార్ స్పందన

ముంబై: ప్రధాని నరేంద్ర మోడీ తనపై చేసిన విమర్శలపై మాజీ కేంద్ర మంత్రి, ఎన్‌సిపి(శరద్ పవార్) అధ్యక్షుడు శరద్ పవార్ గురువారం స్పందించారు. తాను కేంద్ర మంత్రిగా పనిచేసిన కాలంలో(2004-2014) అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ఆ రాష్ట్రం వ్యవసాయ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఎంతో సాయం చేశానని శదర్ పవార్ తెలిపారు. 2004 నుంచి 2014 వరకు కేంద్ర వ్యవసాయ మంత్రిగా శరద్ పవార్ పనిచేశారు. ఒకసారి అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తనను కలసి ఇజ్రాయెల్‌లోని వ్యవసాయ సాంకేతికతను గురించి అధ్యయనం చేయడానికి ఆ దేశాన్ని సందర్శించాలని భావిస్తున్నట్లు తెలిపారని పవార్ చెప్పారు.

వ్యవసాయ రంగానికి చెందిన సమస్యలను గురించి చెప్పుకోవడానికి మోడీ తన వద్దకు తరచు వచ్చేవారని, ఒకసారి తనను గుజరాత్‌కు కూడా తీసుకుని వెళ్లారని పవార్ గుర్తు చేసుకున్నారు. ఇజ్రాయెల్‌ను సందర్శించాలని ఉందని చెబితే తానే ఆ దేశానికి తీసుకువెళ్లానని కూడా పవార్ వెల్లడించారు. ఇప్పడు నరేంద్ర మోడీ తనపై న చేస్తున్న విమర్శలను తాను పట్టించుకోదలచుకోలేదని పవార్ చెప్పారు.

అనతరం ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ 2017 జులైలో ఇజ్రాయెల్‌ను సందర్శించి స్వాతంత్య్రానంతరం ఆ దేశంపై కాలుమోపిన భారత తొలి ప్రధానిగా చరిత్రలో నిలిచారు. మహారాష్ట్రలో బుధవారం ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగిస్తూ కేంద్ర వ్యవసాయ మంత్రిగా ఉన్న కాలంలో ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తి రైతుల కోసం ఏమీ చేయలేదని పరోక్షంగా శరద్ పవార్‌ను ఉద్దేశించి విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News