Monday, January 20, 2025

శరద్ పవార్, సంజయ్ రౌత్‌కు చావు బెదిరింపులు

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి) అధ్యక్షుడు శరద్ పవార్, శివసేన(యుబిటి) ముఖ్య అధికార ప్రతినిధి సంజయ్ రౌత్‌కు శుక్రవారం తాజాగా గుర్తు తెలియని వ్యక్తి నుంచి హతమారుస్తామంటూ బెదిరింపులు వచ్చాయి.

డాక్టర్ నరేంద్ర దభోల్కర్‌కు(2013 ఆగస్టులో పుణెలో కాల్చివేతకు గురైన హేతువాది) పట్టిన గతే శరద్ పవార్‌కు కూడా పడుతుందంటూ ట్విట్టర్ సందేశం ద్వారా పవార్‌కు బెదిరింపు వచ్చింది. శరద్ పవార్‌ను చంపివేస్తామంటూ తనకు వాట్సప్‌లో బెదిరింపు వచ్చిందని ఆయన కుమార్తె, ఎన్‌సిపి ఎంపి సుప్రియా సూలె తెలిపారు. ఈ చర్యలను చవకబారు రాజకీయాలుగా ఆమె అభివర్ణిస్తూ దీనిపై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆమె విజ్ఞప్తి చేశారు.

ఇలా ఉండగా..తన సోదరుడు శివసేన(యుబిటి వర్గం) తఎంపి సంజయ్ రౌత్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయని మహారాష్ట్ర ఎమ్మెల్యే సునీల్ రౌత్‌కు తెలిపారు. నెలరోజుల్లోపల తన మార్నింగ్ లౌడ్‌స్పీకర్లను ఆపాలని, లేని పక్షంలో బుల్లెట్ల వర్షాన్ని కురిపస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచిసంజయ్ రౌత్‌కు బెదిరింపులు వచ్చాయని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ముంబై పోలీసు కమిషనర్‌కు, రాష్ట్ర హోం మంత్రికి తెలియచేసినట్లు సునీల్ రౌత్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News