Sunday, December 22, 2024

ఎప్పుడైనా ఎక్కడైనా బిజెపి నేతపై ఇడి దాడి జరిగిందా?:శరద్ పవార్

- Advertisement -
- Advertisement -

పుణే : దేశంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఏకంగా బిజెపి జేబు సంస్థ అయిందని సీనియర్ నేత శరద్ పవార్ విమర్శించారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ ఏ బిజెపి నేతపైనా ఇడి చర్యలకు దిగలేదని , దీనితోనే ఈ సంస్థ పక్షపాతం ఏ పాటిది అనేది తెలుస్తోందని తెలిపారు. పుణేలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో పవార్ ప్రసంగించారు. అధికార బిజెపిని ఎవరు వ్యతిరేకించినా, రాజకీయంగా ప్రశ్నించినా వారిపై ఇడి దాడులు ఉంటాయి, చర్యలు చేపడుతారని, ఇంతవరకూ కనీసంగానైనా ఏ బిజెపి నేతపై ఇడి దాడులు , విచారణలు జరగలేదని తెలిపారు. ఇది పూర్తిగా దర్యాప్తు సంస్థల దుర్వినియోగం అవుతుందన్నారు. ఈ క్రమంలో ఆయన ఇడి కేసుల లెక్కలు వెల్లడించారు. వీటిలో అత్యధికం ప్రతిపక్ష పార్టీల నేతలపైనే ఉన్నాయని వివరించారు. అజిత్ పవార్ సారధ్యపు పార్టీని నిజమైన ఎన్‌సిపిగా ఎన్నికల సంఘం ఇటీవల గుర్తించింది.

శరద్‌పవార్ వర్గాన్ని ఎన్‌సిపి శరద్‌చంద్ర పవార్ గా ప్రకటించింది. ఎన్‌సిపి చిహ్నాన్ని అజిత్ పవార్‌కు కేటాయింది. ఇటువంటి నిర్ణయాన్ని తన రాజకీయజీవితంలో ఎప్పుడూ తాను చూడలేదని శరద్ పవార్ తెలిపారు. ఈ వైఖరిని ప్రజలు సహించబోరని స్పష్టం చేశారు. అయినా తాను పార్టీ ఎన్నికల చిహ్నం గురించి పట్టించుకోనని, తాను తొలిసారిగా రెండెళ్ల గుర్తుపై ఎన్నికలలో పోటీ చేశానని తెలిపారు. ఈ గుర్తుల కన్నా ఆలోచనలు, సిద్ధాంతాలు ముఖ్యమని తెలిపిన శరద్ పవార్ , ప్రజలు వీటిని ఎక్కువగా గమనించి ఆదరిస్తారని పలుసార్లు నిరూపితంఅయిందన్నారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల బరిలో తాను ఉండటం లేదని బారామతి ఎంపి తెలిపారు. దేశంలో పౌరసత్వ సవరణ చట్టం (కా) అమలు సరికాదని, దీనిపై ఏం జరుగుతుందనేది ఇప్పుడే తాను చెప్పలేనని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News