Wednesday, January 22, 2025

శరత్ రెడ్డి నుంచి బిజెపికి రూ.60 కోట్ల విరాళాలు: ఇడిపై సంజయ్ సింగ్ ఫైర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిలీ: లిక్కర్ కుంభకోణమని చెబుతున్న కేసులోని నిందితుడి నుంచి బిజెపి రూ. 60 కోట్లు పుచ్చుకుందని, కాని దానిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎటువంటి చర్యలు తీసుకోదని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ శనివారం విమర్శించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎటువంటి ఆధారాలు లేకుండానే తనతోపాటు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతోసహా పలువురు ఆమ్ నాయకులను ఇడి అరెస్టు చేసిందని విలేకరుల సమావేశంలో సంజయ్ సింగ్ ఆరోపించారు.

ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఇడి ఆరోపిస్తున్న శరత్ చంద్రరెడ్డి ఎన్నికల బాండ్ల ద్వారా బిజెపికి రూ. 60 కోట్లు ముట్టచెప్పారని, ఈ విషయంలో ఇడి ఎవరిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన చెప్పారు. లిక్కర్ కుంభకోణంలో అరెస్టు అయిన తర్వాత శరత్ చంద్రారెడ్డి 2022 నవంబర్ 15న బిజెపికి రూ. 5 కోట్లు విరాళంగా అందచేశారని సంజయ్ సింగ్ తెలిపారు.

ఆరునెలలు జైలులో ఉండి 2023 మే 8న ఆయనకు బెయిల్ వచ్చిందని, బెయిల్‌పై విడుదలైన కొద్ది రోజులకే ఎన్నికల బాండ్ల ద్వారా బిజెపికి రూ. 50 కోట్లు ఆయన అందచేశారని సంజయ్ తెలిపారు. అరెస్టు కావడానికి ముందు శరత్ చంద్రారెడ్డి 2022లో బిజెపికి విడతల వారీగా రూ. 5 కోట్లు విరాళంగా అందచేశారని ఆయన తెలిపారు. మార్చి 21న ఎన్నికల బాండ్ల విరాలు బహిర్గతమై తరత్ చంద్రారెడ్డి నుంచి బిజెపి విరాళాలు పుచ్చుకుందని వెల్లడైన వెంటనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంపై ఇడి దాడి చేసి ఆయనను అరెస్టు చేసిందని సంజయ్ సింగ్ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News