Wednesday, April 16, 2025

ప్రతి ఒక్కరూ కచ్చితంగా చూడాలి.. ‘కోర్ట్‌’ మూవీపై శరత్‌ కుమార్ ప్రశంసలు

- Advertisement -
- Advertisement -

హర్ష్‌ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన సినిమా కోర్ట్. మార్చి 14 విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇటీవల ఓటిటిలోకి వచ్చిన ఈ సినిమా మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. తాజాగా ఈ మూవీని చూసిన కోలీవుడ్ నటుడు శరత్‌ కుమార్ ప్రశంసలు కురిపించారు. ప్రతి ఒక్కరూ కచ్చితంగా చూడాల్సిన సినిమా అని పేర్కొన్నారు. కాగా, నాచురల్ స్టార్ నాని సమర్పణలో ఆయన సోదరి నిర్మించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చిన్న సినిమాగా వచ్చిన కోర్ట్ మూవీ భారీ విజయాన్ని సాధించింది. ప్రియదర్శి, శివాజీ నటనపై కూడా మూవీ చూసిన వారందరూ ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News