Monday, December 23, 2024

కరీంనగర్ నేపథ్యంగా.. షరతులు వర్తిస్తాయి

- Advertisement -
- Advertisement -

చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. కుమారస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్‌లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డా.కృష్ణకాంత్ జల్లు నిర్మించారు. ఈ సినిమా ఈనెల 15న థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. సోమవారం ఈ సినిమా నుంచి ‘తురుమై వచ్చేయ్…’ లిరికల్ సాంగ్‌ను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ “కరీంనగర్ నేపథ్యంగా సినిమా చేయడం సంతోషకరం. సినిమా కంటెంట్ ఆసక్తికరంగా ఉంది.

ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నా”అని అన్నారు. హీరో చైతన్య రావు మాట్లాడుతూ ఓ సమస్యను ఎదిరించే క్రమంలో హీరో ఎలాంటి తెగువ చూపించాడనేది ఈ పాటలో ఆసక్తికరంగా చూపించడం జరిగిందని తెలిపారు. దర్శకుడు కుమార స్వామి మాట్లాడుతూ సమస్యలకు భయపడకుండా ఎదిరించి నిలవాలనే స్ఫూర్తిని అందించేలా ఈ పాటను రూపొందించామని పేర్కొన్నారు. ’తురుమై వచ్చేయ్..’ పాటకు పసునూరి రవీందర్ లిరిక్స్ అందించగా..అరుణ్ చిలువేరు మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఎంఎల్‌ఆర్ కార్తికేయన్ పాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News