Wednesday, January 22, 2025

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్ !

- Advertisement -
- Advertisement -

 

Indices

ముంబై: మే నెలలో వరుసగా ఐదో రోజున కూడా స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలనే చవిచూశాయి. మార్కెట్ గురువారం ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,158.08 పాయింట్లు పతనమై 52,930.31 వద్ద, నిఫ్టీ 359.10 పాయింట్లు పతనమై 15,808 వద్ద ముగిసింది. దాదాపు 747 షేర్లు లాభపడగా, 2542 షేర్లు నష్టపోయాయి. 84 షేర్లు ఎలాంటి మార్పులు లేకుండా నిలిచాయి. నిఫ్టీలో అదానీ పోర్ట్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, టాటా స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్ నష్టపోగా, కేవలం విప్రో ఒకటే లాభపడింది. అన్ని రంగాల షేర్లు… అంటే– క్యాపిటల్ గూడ్స్, ఆటో, బ్యాంక్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, ఎఫ్‌ఎంసిజి, ఫార్మ, రియాల్టీ సూచీలు 1 నుంచి 4 శాతం మేరకు నష్టపోయాయి. స్థూలంగా సూచీలను చూసినట్లయితే, బిఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 2 శాతం చొప్పున పతనమయ్యాయి.

దేశీయ స్టాక్ మార్కెట్లో బేర్(ఎలుగు) పట్టు బిగించింది. అంతర్జాతీయ మార్కెట్ బలహీన సంకేతాలు, ద్రవ్యోల్బణం భయాలు మార్కెట్ ను పడదోసాయి. గత కొన్ని రోజులుగా విదేశీ సంస్థాగత మదుపర్లు ఎడతెరిపి లేకుండా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. దాంతో సెంటిమెంట్ బాగా దెబ్బతిన్నది. అంతర్జీతీయంగా చమురు ధరల పెరుగుదల, ప్రపంచ ఆర్థిక మందగమనం నేపథ్యంలో వచ్చే రెండేళ్లకు భారత జిడిపి అంచనాలను మోర్గాన్ స్టాన్లీ తగ్గించింది. దీనికి తోడు ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఇప్పుడప్పుడే కొలిక్కి వచ్చేలా కనపడడం లేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News